లాస్ ఏంజిల్స్: లాస్ ఏంజిల్స్‌లో చంద్రుడెక్కడికెళ్లాడు.. చందమామ కనిపించడం లేదు.. ఇంకా వెయిటింగ్ చేస్తున్నానంటూ ప్రీతీ జింతా తన ఇన్‌స్టాలో ఓ పోస్టు పెట్టింది. గురువారం లాస్ ఏంజిల్స్‌లో కర్వా చౌత్ సెలబ్రేట్ చేసుకున్న ఆ బాలీవుడ్ భామ అక్కడ చంద్రుడి కోసం సుదీర్ఘంగా ఎదురుచూసింది.
ఆకాశంలో చందమామ కనిపించకపోవడంతో ఆమె తన ఇన్‌స్టా పోస్టులో ఆ విషయాన్ని చెప్పింది. లాస్ ఏంజిల్స్‌లో చంద్రుడికి ఏమైందో ఎవరైనా చెబుతారా అని అడిగింది. ఇక కర్వా చౌత్ జరుపుకుంటున్న వారందరికీ ఆమె విషెస్ తెలిపింది.
2016లో జీన్ గుడ్ఎనాఫ్ను ప్రీతి పెళ్లి చేసుకున్నది. ఆ ఇద్దరూ ఇప్పుడు తమ పిల్లలతో కలిసి లాస్ ఏంజిల్స్‌లో జీవిస్తున్నారు.