e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 27, 2021
Home News రైలులో ప్రసవించిన మహిళ

రైలులో ప్రసవించిన మహిళ

హైదరాబాద్‌ : దేవగిరి రైలులో ఆదివారం ఓ మహిళ ప్రసవించింది. ఓ గర్భిణి సికింద్రాబాద్‌ నుంచి ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్‌కు వెళ్తున్న రైలులో ముద్ఖేడ్‌ వరకు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో రైలు డిచ్‌పల్లి వరకు చేరుకోగానే సదరు మహిళకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. తోటి ప్రయాణికులు వెంటనే 108కు సమాచారం అందించారు. రైలు నిజామాబాద్‌ చేరుకునే సమయానికి ఆమె మగబిడ్డకు జన్మనించింది. తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. రైలు నిజామాబాద్‌లో నిలిపిన తర్వాత తల్లీబిడ్డను జిల్లా ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. అయితే, మహిళకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement