తెలుగు యూనివర్సిటీ : తెలుగు వికీపీడియా గురించి కొత్తవారు స్వయంగా నేర్చుకోగలిగే పాఠ్య ప్రణాళిక దానికి అవసరమైన అన్ని రకాల భోధనా ఉపకరణాలు తయారు చేసేందుకు తెలుగు వికీపీడియన్ ప్రణయ్‌రాజ్ వంగరికి వికీపీడియా సంస్థ నుండి ప్రాజెక్టు గ్రాంట్ లభించింది. ఈ ప్రాజెక్టుకు సహ గ్రాంటీగా మరో తెలుగు వికీపీడియన్ పవన్ సంతోష్ వ్యవహరిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌కి చెందిన ప్రణయ్ తన ప్రాజెక్టు ప్రపోజల్‌ను సమర్పించగా వికీపీడియా ఫౌండేషన్ ఆ ప్రాజెక్టుకు అనుమతినిచ్చింది.
ప్రణయ్ గత ఎనిమిదేళ్ళుగా తెలుగు వికీపీడియాలో వ్యాసాలను రాయడమే కాకుండా తెలుగు వికీపీడియా గురించి తెలుగువారందరికీ తెలిసేల వివిధ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కలిపిస్తూ వికీ శిక్షణా శిభిరాలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రణయ్ ఎనిమిదేళ్ళ కృషికిగాను వికీపీడియా ప్రాజెక్టు గ్రాంట్ లభించింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరిక్రిష్ణ, తెలంగాణ డిజిటల్ మీడియా డైరక్టర్ కొణతం దిలీప్‌తో పాటు పలువురు తెలుగు వికీపీడియన్లు ప్రణయ్‌కు అభినంధనలు తెలిపారు.
ఈ సందర్బంగా ప్రణయ్ రాజ్ వంగరి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా చక్కటి పాఠ్య ప్రణాళికతో వివిధ స్థాయిలో ఎవరి సహాయం లేకుండానే చూసి చదివి విని నేర్చుకునేల ఉండే సహయం పేజీలు వీడియోలు ఆడియోలు కలిసిన ఒక పూర్తి పాఠ్య ప్రణాళిక తయారు చేయవచ్చన్నారు. తయారవుతున్న పాఠ్య ప్రణాళికను భోధనపకరణాలను ఆసక్తి కలిగిన వాడుకరుల మీద ప్రయోగించి చూసి దానిని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉన్నతమైన నాణ్యతతో రూపొందిస్తామన్నారు. పవన్ సంతోష్, వీవెన్, యరా రామారావు, కృష్ణచైతన్య వంటి వికీపీడియన్లు ఈ ప్రాజెక్టు కమిటీ సభ్యులుగా ఉండి పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తారని వెల్లడించారు.