ప్రభుదేవా, అదాశర్మ, నిక్కీగల్రాని నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ ప్రేమికుడు’. శక్తి చిదంబరం దర్శకుడు. వి. శ్రీనివాసరావు, గుర్రం మహేష్ చౌదరి నిర్మాతలు. తమిళ చిత్రం ‘చార్లీచాప్లిన్-2’కు అనువాదమిది. ఈ నెల 29న విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ ‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. వేశ్య కారణంగా ఓ ప్రేమికుడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? తన ప్రేమను ఎలా నిలబెట్టుకున్నాడనేది ఆద్యంతం నవ్వులను పంచుతుంది. ప్రభుదేవా నటన, డ్యాన్సులు సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. స్ట్రెయిట్ సినిమా చూస్తున్న అనుభూతిని పంచుతుంది’ అని తెలిపారు. పంపిణీదారులుగా మంచి పేరుతెచ్చుకున్న శ్రీనివాసరావు, మహేష్చౌదరి ఈ సినిమా ద్వారా నిర్మాతలుగా విజయాన్ని అందుకోవాలని ప్రసన్నకుమార్ పేర్కొన్నారు.