ఒప్పుకున్న భారీ చిత్రాలను ఒక్కొక్కటిగా పూర్తి చేసే పనిలో పడ్డారు స్టార్ హీరో ప్రభాస్. ఒకేసారి ఐదు పాన్ ఇండియా చిత్రాలు లైనప్ చేసుకున్నారాయన. వీటిలో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ‘సలార్’, నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాలు రెగ్యులర్ షూటింగ్లో ఉండగా..దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న ‘ఆది పురుష్’ చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నది. ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాలు దాదాపు ఏకకాకంలో షూటింగ్ జరుగుతున్నట్లే.
షెడ్యూల్స్‌ను బట్టి డేట్స్ ఇస్తున్నారట ప్రభాస్. ఇంత బిజీ షెడ్యూల్స్‌లో ప్రభాస్ మరో సినిమాను బిగిన్ చేయబోతున్నారనే వార్త బయటకొచ్చింది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభించుకోనుందని సమాచారం. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఉండనుంది. ప్రభాస్ కెరీర్లో ఇదొక భిన్నమైన చిత్రం అవుతుందని అంటున్నారు. ఇవి కాక ఆయన ఖాతాలో సందీప్ వంగా దర్శకత్వం వహించే ‘స్పిరిట్’ సినిమా ఉంది. తాజాగా ‘సలార్’ సెట్స్ నుంచి ప్రభాస్ లేటెస్ట్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అభిమానులు ఈ ఫొటోను వైరల్ చేస్తున్నారు.