బాహుబలి బిర్యానీ పంపించాడంటే అది కచ్చితంగా బెస్ట్‌గానే ఉంటుంది.. ఇదీ బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఆదివారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫొటో షేర్ చేస్తూ చేసిన కామెంట్ ఇది. కరీనా భర్త సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి ఆదిపురుష్‌లో నటిస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఎంతో ప్రేమతో కరీనాకు పంపిన బిర్యానీ ఇది. ఫుడ్ లవర్ అయిన కరీనా.. ఈ స్పెషల్ బిర్యానీని లొట్టలేస్తూ ఎంజాయ్ చేసింది. పనిలో పనిగా దీనిని పంపిన ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పింది. సినిమాల విషయానికి వస్తే లాల్ సింగ్ చద్దాలో ఆమిర్ ఖాన్ సరసన కరీనా కనిపించనుంది. రెండోసారి గర్భవతి అయిన కొత్తలోనే ఆమె ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసింది.