పెద్దనాన్న కృష్ణంరాజు లేడన్న బాధలో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas). కృష్ణంరాజు ఇటీవలే కన్నుమూయడంతో పభాస్ ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో సలార్ సినిమా షూటింగ్‌ను మేకర్స్ సెప్టెంబర్ చివరి వారానికి వాయిదా వేశారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్న ప్రభాస్ మళ్లీ షూటింగ్‌తో బిజీ కానున్నాడు. తాజాగా ప్రభాస్ షూట్లో జాయిన్ అవుతున్నాడన్న అప్డేట్ బయటకు వచ్చింది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సలార్ (Salaar)షూటింగ్లో ప్రభాస్ నేటి నుంచి పాల్గొననున్నాడట. ఇవాళ్టి నుంచి సినిమాలోని కీలక నటీనటులపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు ఇన్సైడ్ టాక్. కేజీఎఫ్,కేజీఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందించిన ప్రశాంత్ నీల్ (Prashanth Neel) మరోసారి పాన్ ఇండియా ప్రాజెక్టు సలార్‌తో రికార్డులు బద్దలు కొట్టేందుకు వస్తున్నాడు. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ప్రభాస్ వీటితోపాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్టు కే కూడా చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే కీ రోల్స్‌లో నటిస్తున్నారు. మరోవైపు తానాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వంలో మైథాలాజికల్ డ్రామాగా వస్తున్న ఆదిపురుష్ కూడా లైన్లో ఉంది. ఈ సినిమాల షూట్‌పై కూడా అప్ డేట్ రావాల్సి ఉంది.
Read Also : Aishwarya Trisha selfie | సెట్స్‌లో ఐశ్వర్యరాయ్, త్రిష సెల్ఫీ..క్రేజీ కాంబో కోసం వెయిటింగ్
Read Also : The Ghost Training video | ‘ది ఘోస్ట్’ కోసం నాగార్జున ట్రైనింగ్..ట్రెండింగ్‌లో వీడియో