పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా నటిస్తున్న చిత్రం ‘బ్యాక్‌డోర్’. కర్రి బాలాజీ దర్శకుడు. బి.శ్రీనివాసరెడ్డి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. దీపావళి కానుకగా ప్రేక్షకులుమందుకురానుంది. ఈ చిత్రానికి క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ లభించింది. నిర్మాత మాట్లాడుతూ ‘యువతరాన్ని కట్టిపడేసే అన్ని అంశాలున్న చిత్రమిది. పూర్ణ పాత్ర చిత్రణ కొత్త పంథాలో ఉంటుంది. ఆమె మునుపెన్నడూ చేయని పాత్రలో కనిపిస్తుంది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీకాంత్ నారోజ్, సంగీతం: ప్రణవ్, పాటలు: నిర్మల, చాందిని, నిర్మాత: బి.శ్రీనివాస్‌రెడ్డి, రచన-దర్శకత్వం: కర్రి బాలాజీ.