పూనమ్ బజ్వా..నెట్టింట్లో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక అప్ డేట్‌తో నెటిజన్లలో జోష్ నింపుతుంది. ఈ భామ ఫొటోలు పెట్టిందంటే చాలు లైకుల వరద వస్తూనే ఉంటుంది. ఎప్పుడూ ట్రెండీ స్టైలిష్ లుక్ లో కనిపించే పూనమ్ తాజాగా సంప్రదాయ వస్త్రధారణలో కనిపించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. పూనమ్ గులాబీ రంగు చీరలో మెరిసిపోతూ..జాలువారుతున్నట్టుగా కనిపిస్తున్న కురులతో తన ఓర చూపులతో కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తోంది.
పూనమ్ దీంతోపాటు బ్లాక్ అండ్ వైట్ పొట్టి డ్రెస్ లో హాట్ హాట్ గా కెమెరాకు ఫోజులిచ్చింది. పూనమ్ బజ్వా డ్యుయల్ యాంగిల్ స్టిల్స్ ఇపుడు ఆన్లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. 2019లో వచ్చిన ఎన్టీఆర్..కథానాయకుడు చిత్రంలో లోకేశ్వరి పాత్రలో కనిపించింది పూనమ్. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తుండగా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.