ఎయిర్‌పోర్టులో ఒక విమానం ల్యాండవుతోంది. ఆ సమయంలో అప్పటికే ఆ రన్‌వే పై మరో విమానం ఉంది. దీన్ని గమనించని పైలట్.. తన విమానాన్ని అదే రన్‌వేపై ల్యాండ్ చేయబోయాడు. దాంతో రెండు దాదాపు ఢీకొట్టుకున్నంత పని అయింది. అదే సమయంలో మరో రన్‌వేపై తన విమానం టేకాఫ్ కోసం వెయిట్ చేస్తున్న సాల్మరాన్ అనే పైలట్.. తన క్యాబిన్ నుంచి ఈ ఘటనను వీడియో తీశాడు.
ఇది వైరల్ అవడంతో సదరు వైమానిక సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాక్‌పిట్‌లో మొబైల్ వాడినందుకు సాల్మరాన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు వోలారిస్ ఎయిర్వేస్ వెల్లడించింది. అయితే తను నిబంధనలు ఉల్లంఘించిన మాట వాస్తవమేనని, అయితే మొబైల్ వాడేందుకు తన పైఅధికారి నుంచి పర్మిషన్ తీసుకున్నానని, అలాగే ల్యాండవుతున్న విమానం పైలట్‌కు రన్‌వే పై మరో విమానం ఉన్న విషయం కూడా చెప్పానని సాల్మరాన్ అంటున్నాడు.
దాదాపు ఢీకొన్న విమానాలు రెండూ కూడా వోలారిస్ కంపెనీకి చెందినవే కావడం గమనార్హం. దీంతో సాల్మరాన్ను నిబంధనల సాకు చూపించి ఉద్యోగం నుంచి తొలగించారని మరో వైమానిక సంస్థ ఏరోమెక్సికో పైలట్ల యూనియన్ దీన్ని ఖండించింది. స్టెరైల్ క్యాబిన్ నిబంధనలను చాలామంది ఉల్లంఘిస్తారని, అంతేకాకుండా సాల్మరాన్ ఉన్న విమానం బ్రేకులు వేసి ఉన్నాయని, అంటే ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు వాదిస్తున్నారు.