ఆరోగ్య బీమా నియమాలు…
2020లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్ అథారిటి (ఐఆర్ డీఏ) కోవిడ్ స్టాండర్డ్ హెల్త్ పాలసీల కింద కోవిడ్ ట్రీట్ మెంట్ ను ఆమోదించింది. ఐఆర్ డీఏ నిబంధన ప్రకారం కోవిడ్ సోకిన వ్యక్తికి ఆరోగ్య బీమా ఉంటే గరిష్టంగా 14 రోజుల పాటు ఇంటి వద్దనే తీసుకునే ట్రీట్ మెంట్ కు అయ్యే ఖర్చుకు బీమా వర్తిస్తుంది. అయితే హోమ్ ట్రీట్మెంట్ ను డాక్టర్లు సూచించడంతో పాటు, డాక్టర్లే మానిటరింగ్ చేస్తూ ట్రీట్ మెంట్ ను రికార్డ్ చేయాలి. ట్రీట్ మెంట్ ఇచ్చే డాక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీ నెట్ వర్క్ ఆఫ్ హాస్పిటల్స్ సంబంధించిన వారైతే, కాష్ లెస్ ట్రీట్ మెంట్ కూడా తీసుకోవచ్చు. నెట్ వర్క్ లో లేకపోతే, క్లయిమ్ లను రీఎంబర్స్ మెంట్ చేసుకోవచ్చు. ఈ రెండు పద్ధతుల్లోనూ ఇన్సూరెన్స్ కంపెనీ క్లయిమ్ సెటిల్ మెంట్ పద్ధతులనే పాటించాల్సి ఉంటుంది.