పెళ్లి సందD సినిమాతో హీరోయిన్గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది శ్రీలీల (Sreeleela). ఈ బ్యూటీ ప్రస్తుతం రవితేజతో కలిసి ధమాక్ సినిమాలో నటిస్తోంది. కాగా ఈ భామకు మరో క్రేజీ ప్రాజెక్టులో నటించే ఛాన్స్ కొట్టేసిందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. జాతి రత్నాలు, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా మంచి బ్రేక్ అందుకున్నాడు నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty). ఈ యువ హీరో ప్రస్తుతం అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju) అనే చిత్రంలో నటిస్తున్నాడు.
సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇవాళ శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. పంజాబీ డ్రెస్లో గ్లామర్ డాళ్గా కనిపిస్తోంది శ్రీలీల. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని Fortune Four Cinemas కో ప్రొడ్యూస్ చేస్తోంది. ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. నవీన్ పొలిశెట్టి మరోవైపు యూవీ క్రియేషన్స్ బ్యానర్లో అనుష్క శెట్టితో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.
Team #AnaganagaOkaRaju wishes the gorgeous & talented @sreeleela14 a very happy birthday!#HBDSreeLeela ✨ pic.twitter.com/zOP4LDUKN6
— Sithara Entertainments (@SitharaEnts) June 14, 2022