పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం ప్రేక్షకు ల ముందుకొచ్చి మూడేళ్లవుతుంది. అభిమానులు ఎప్పుడెపుడా అని ఎదురుచూస్తున్న వకీల్‌సాబ్ 2020లోనే థియేటర్లలో సందడి చేయాల్సి ఉండేది. కానీ కరోనా ఎఫెక్ట్ తో చాలా రోజుల విరామం తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 19న విడుదలవుతుంది.పవన్ కల్యాణ్ బాక్సాపీస్ వద్ద తన ప్రతాపం చూపించడానికి మరో 30 రోజులే టైం ఉంది. వకీల్‌సాబ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో పవన్ న్యూ లుక్ ఒకటి ఫుల్ జోష్ నింపుతోంది.
పవన్ బ్లాక్ ట్రౌజర్-టీ షర్ట్‌తో క్లీన్ షేవ్ లుక్‌లో స్టైలిష్ గా నవ్వుతున్న స్టిల్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఓ వైపు పాలిటిక్స్ తో బిజీ షెడ్యూల్ ఉన్నా ఫిజికల్ ఫిట్నెస్, డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు పవన్. పవర్ స్టార్ ఇలా న్యూ లుక్‌లో నడుముకు చేతులు పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న స్టిల్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పవన్ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో, హరీష్‌శంకర్, సాగర్ చంద్ర డైరెక్షన్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.