e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, April 13, 2021
Advertisement
Home News బాలయ్యను ఫాలో అవుతున్న పవన్.. తొలిసారి అలా!

బాలయ్యను ఫాలో అవుతున్న పవన్.. తొలిసారి అలా!

బాలయ్యను ఫాలో అవుతున్న పవన్.. తొలిసారి అలా!

పవన్ కళ్యాణ్ ఏంటి.. బాల‌కృష్ణ‌ను  ఫాలో అవుతున్నాడ‌ని  అనుకుంటున్నారా..? కాస్త చిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే చేయబోతున్నాడు పవర్ స్టార్. ఇంతకీ ఏ విషయంలో బాలయ్యను పవన్ ఫాలో అవుతున్నాడో తెలుసా..? తొడ కొట్టడంలో.. మీసం తిప్పడంలో. సాధారణంగా తొడ కొట్టడం అంటే ముందుగా  టాలీవుడ్‌లో గుర్తుకొచ్చే హీరో బాలయ్యే. చాలా మంది హీరోలు అలా చేసినా కూడా తొడ కొట్టే సీన్స్ కు బ్రాండ్ అంబాసిడర్ మాత్రం బాలయ్యే. మెగా హీరోలు తొడ కొట్టే సన్నివేశాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇదే చేయబోతున్నాడు. అది కూడా తన కెరీర్ లో తొలిసారి అలాంటి సీన్స్ చేయబోతున్నాడు పవన్‌.   

ప్రస్తుతం  ప‌వ‌న్  క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. 15వ శతాబ్దం నాటి పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో పవన్ వజ్రాల దొంగగా కనిపిస్తున్నాడు. పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా ఇది. దాదాపు 120 కోట్లకు పైగా బడ్జెట్ ఈ సినిమా కోసం పెడుతున్నాడు ఏఎం రత్నం. ఈ సినిమాకు ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్ రిజిష్టర్ చేయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ తో పాటు టీజర్ కూడా మార్చ్ 11న శివరాత్రి కానుకగా విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో పవన్ భారీ స్టంట్స్ చేస్తున్నాడు. పాతబస్తీ మల్లయోధులతో కుస్తీ పోటీలు కూడా ఉండబోతున్నాయి. 

ఈ ఫైట్ సీక్వెన్స్ సందర్భంగానే పవన్‌తో  తొడకొట్టించడమే కాకుండా అందులో మీసం మెలేసే సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న‌ది. ఈ సీన్స్ అన్నీ పవన్ కెరీర్ లో ఇదివరకు ఎప్పుడూ తీయని విధంగా.. ఇకపై ఎప్పుడూ చూసేలా వీలు లేనంత గ్రాండ్ గా తెరకెక్కించబోతున్నాడు క్రిష్. సినిమాలో పవన్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. 2022 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.    

Advertisement
బాలయ్యను ఫాలో అవుతున్న పవన్.. తొలిసారి అలా!

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement