e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

అమరావతి,జూన్ 2; తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. “నా తరఫున, జనసేన పక్షాన హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. రాజ్ భవన్ ను సామాన్యులకు చేరువ చేసి ఇక్కడివారితో మమేకం అవుతున్న విధానం తమిళిసై సౌందరరాజన్ గారిలోని మానవీయ కోణాన్ని తెలియచేస్తుంది’అని ఆయన పేర్కొన్నారు.

“పేద పిల్లల విద్యాబుద్ధులు, వారి సర్వతోముఖాభివృద్ధి గురించి నిరంతరం ఆలోచిస్తున్నారు. స్వతహాగా వైద్యురాలైన తమిళిసై సౌందరరాజన్ గారు మహిళల ఆరోగ్యంపట్ల ఓ తోబుట్టువులా చూపుతున్న శ్రద్ధ సర్వదా అభినందనీయం. తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతి కోసం చేస్తున్న ఆలోచనలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకొంటున్నాయి. దేవదేవుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను తమిళిసై సౌందరరాజన్ గారికి అందించాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పవన్ కల్యాణ్ అన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

ట్రెండింగ్‌

Advertisement