మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకర బోర్డ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు.
పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తన ఇష్టం వచ్చిన రీతిలో విద్యార్థులతో మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేశారు.