e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News పేరెంట్స్ బీకేర్‌ఫుల్‌.. మీ కోపంతో పిల్లల భ‌విష్య‌త్తు ఏమ‌వుతుందో ఆలోచించారా?

పేరెంట్స్ బీకేర్‌ఫుల్‌.. మీ కోపంతో పిల్లల భ‌విష్య‌త్తు ఏమ‌వుతుందో ఆలోచించారా?

Children | అమ్మా.. నాన్నల ప్రేమ పిల్లలకు బలమవ్వాలి. వారి ఐకమత్యం ఆదర్శంగా నిలువాలి. వారి కష్టాలు పిల్లలు విజయాలు సాధించడానికి కసిని రగిలించాలి. వారి పెంపకం సమస్యలను పరిష్కరించుకోగలిగే చాతుర్యతను ఇవ్వాలి. మొత్తంగా మంచి పేరెంటింగ్‌ పిల్లల కష్టసుఖాల్లో ఓదార్పునివ్వాలి. వారి స్నేహపూర్వక విధానం నూతనోత్తేజాన్ని కలిగించాలి. అయితే ప్రస్తుత బిజీలైఫ్‌లో ఇది కొరవడుతున్నది.

జరసోచో..

తల్లిదండ్రుల డిప్రెషన్‌ పిల్లల్లో మానసిక సమస్యలకు కారణమవుతుంది. తల్లి ఒత్తిడితో బాధపడితే అది పిల్లలపై అధికంగా ప్రభావం చూపనుందని అధ్యయనం పేర్కొంది. తల్లిదండ్రులు ఇద్దరూ డిప్రెషన్‌లో ఉంటే అది చిన్నారుల ఎదుగుదలపై వ్యతిరేక ప్రభావం చూపనుంది. స్కూళ్లో, కాలేజీలో స్నేహితులతో ఎక్కువగా మాట్లాడకపోవడం, చదువుపై ఆసక్తి తగ్గిపోవడం, ఆకలి మందగించడం తదితర కారణాలతో చిన్నారులు నిరుత్సాహంగా ఉండిపోతున్నారు. జీవితంలో కొత్తదనం ఇంకేమీ ఉండదని దిగాలు చెందుతున్నారని సర్వే హెచ్చరించింది. పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న పేరెంట్స్‌ ఆ ఒత్తిడిని ఇంట్లో పిల్లలపై చూపిస్తుండటంతో చిన్నారులు ఒత్తిడికి గురవుతున్నారు. ఈ విషయాలు పిల్లలపై దుష్ప్రభావాలు చూపిస్తాయని సైకాలజిస్టులు చెబుతున్నారు. చిన్నారుల సున్నిత మనసులను అల్లకల్లోలం చేస్తూ ఆత్మహత్యల వైపునకు పురిగొల్పుతున్నాయని హెచ్చరించారు. గతంలో అడొల్సెంట్‌ బ్రెయిన్‌ కాగ్నిటివ్‌ డెవలప్‌మెంట్‌ (ఏబీసీడీ) స్టడీ కూడా తల్లిదండ్రుల నిరాశ పిల్లలకు శాపంగా మారుతుందని వెల్లడించింది.

- Advertisement -

పిల్లలతో ఫ్రెండ్లీ పేరెంటింగ్‌ లోపిస్తుంది. పనిఒత్తిడి, దంపతుల మధ్య పొరపొచ్చాలు పిల్లలపై పెనుప్రభావం చూపిస్తున్నాయి. తల్లిదండ్రుల ఘర్షణ పిల్లల లేతమనసులను కుంగదీస్తున్నాయి. వారి స్వేచ్ఛాపూరిత ఆలోచనలను చిదిమేస్తున్నాయి. ఫలితంగా చిన్నారులు తమ విజయాలకు దూరం అవుతున్నారు. ఇదే విషయాన్ని ఇంటర్నేషనల్‌ జర్నల్స్‌, సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల పబ్లిక్‌ లైబర్రీ ఆఫ్‌ సైన్స్‌(జర్నల్‌) జరిపిన తాజా స్టడీలో పేరెంట్స్‌ ఒత్తిడి కారణంగా పిల్లలు మైల్‌స్టోన్స్‌ను అధిగమించడంలో వెనుకబడిపోతున్నారని పేర్కొంది.

పిల్లల్లో నేరాలోచనలు రాకుండా చూడాలి

తల్లిదండ్రులు పిల్లలతో సమయాన్ని కేటాయించాలి. లేకపోతే చిన్నారుల్లో విష ఆలోచనలు కలిగే అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రుల డిప్రెషన్‌ పిల్లలలో కోపాన్ని కలిగిస్తుంది. దీని వల్ల పిల్లలు తరచూ చికాకుపడుతుంటారు. వారిలో నేరాలోచనలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతారు. పేరెంట్స్‌ ఎలాంటి పరిస్థితులో ఉన్నా.. పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వారి భవిష్యత్తు సజావుగా సాగాలంటే పేరెంట్స్‌గా వారికి సమయం కేటాయించాలి. వారి ఆలోచనలు, ఆశలు తెలుసుకుని అందుకుతగ్గట్టుగా వ్యవహరించాలి.

– డాక్టర్‌ పాన్యం కవిత, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌

పిల్లల ప్రవర్తనలో తేడా గమనించాలి

పిల్లల ప్రవర్తనలో తేడా కనిపిస్తే వెంటనే గుర్తించాలి. సరైన చికిత్స అందిస్తే పరిస్థితి మెరుగవుతుంది. తల్లిదండ్రులు నిరాశ, నిసృ్పహలకు లోనవ్వకుండా సరైన ప్రణాళికలతో జీవితాన్ని లీడ్‌ చేయాలి. సాధారణంగా కుంటుంబంలో తల్లిదండ్రుల నుంచే చిన్నారులు జీవిత పాఠాలు నేర్చుకుంటారు. మంచి, చెడును విశ్లేషించి.. తెలివితేటలను నేర్పించేది వారే. కానీ ప్రస్తుత పరిస్థితులు కాలంతో పాటు పరుగెత్తేలా ఉన్నాయి. ఈ స్థితిలో తల్లిదండ్రులు ఎక్కువ సంఖ్యలో డిప్రెషన్‌కు గురవుతున్నారు. వారి ప్రవర్తనలో మార్పు వచ్చి.. నెగెటివ్‌గా బిహేవ్‌ చేస్తున్నారు. అది చిన్నారులపై విష ప్రభావాన్ని చూపిస్తున్నది.

– మోత్కూరి రాంచంద్రం, సైకాలజిస్టు.

ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ నేర్పించాలి

తల్లిదండ్రుల డిప్రెషన్‌ కచ్చితంగా చిన్నారులపై విష ప్రభావాన్ని చూపిస్తుంది. అలాంటి పేరెంట్స్‌ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ పేరెంట్‌ అయిన పిల్లలు చెప్పే విషయాలను పూర్తిగా వినాలి. అది మనకు ముఖ్యమైనది కాకపోవచ్చు. కానీ చిన్నారులకు అదే చాలా కీలకమనే విషయం మరవకూడదు. ముఖ్యంగా సమస్యను పరిష్కరించడం ఎలా అనే విషయాలు నేర్పించాలి. స్కూల్‌ నుంచి ఇంటికొచ్చాక వారు ఎన్నో విషయాలు చెబుతారు. అందులోనే వారు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది తెలిసిపోతుంది. అది నెగెటివ్‌గా ఉంటే సరి చేయాలి. ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ నేర్పించాలి.

– డాక్టర్‌ కవిత, కౌన్సెలింగ్‌ సైకాలజిస్టు

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?

కంగారూ కేర్‌ | శిశువును తల్లి ఎక్కువ సేపు ఎత్తుకుంటే ఎన్నో లాభాలున్నాయి.. ఏంటో తెలుసా

మా ఆయ‌న‌కు ఆ స‌మ‌స్య ఉంది.. డాక్ట‌ర్‌ను క‌లుద్దామంటే విన‌ట్లేదు.. ఏం చేయమంటారు?

pneumonia | పిల్ల‌ల్లో ఈ ల‌క్ష‌ణాలు ఉన్నాయా? న్యుమోనియా కావ‌చ్చు !

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement