హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో (Banjara hills) కారు బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబర్.12లో వేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పి రోడ్డుపై ఉన్న చిన్న మందిరాన్ని ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో నుంచి యువకుడిని బయటకు తీసి దవాఖానకు తరలించారు. ప్రమాద ధాటిని కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.