హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ తదితర కోర్సుల రెండు, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.