e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 25, 2021
Home News త‌మ‌న్నా-గోపీచంద్‌ ఊర‌మాస్ 'జ్వాలారెడ్డి' వీడియో సాంగ్

త‌మ‌న్నా-గోపీచంద్‌ ఊర‌మాస్ ‘జ్వాలారెడ్డి’ వీడియో సాంగ్

గోపీచంద్, త‌మ‌న్నా కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్రం సీటీమార్‌. క‌బ‌డ్డీ స్పోర్ట్స్ నేప‌థ్యంలో వ‌స్తున్న ఈ చిత్రానికి సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ జ్వాలారెడ్డి లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశారు. ‘జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డ‌రో..కారా బూంది ల‌డ్డురో..కారా బూంది ల‌డ్డురో ఆడించే క‌బ‌డ్డిరో ..బాలారెడ్డి బాలారెడ్డి ఆంధ్రా టీం హెడ్డురో..కోన‌సీమ బ్ల‌డ్డురో..కోనసీమ బ్ల‌డ్డురో పోర‌డు ఏ టు జెడ్రో’  అంటూ సాగే ఈ పాట ఊరమాస్‌గా సాగుతూ మ్యూజిక్ ల‌వ‌ర్స్ ను ఎంట‌ర్టైన్ చేస్తుంది.

మ‌ణిశ‌ర్మ అందించిన బీట్స్ అంద‌రిలో జోష్ నింపుతున్నాయి. కాస‌ర్ల శ్యామ్ రాసిన ఈ పాట‌ను శంక‌ర్‌బాబు, మంగ్లీ పాడారు. సీటీమార్‌లో ఆంధ్ర క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా మిల్కీ బ్యూటీ ‌త‌మ‌న్నా న‌టిస్తున్నారు. పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

- Advertisement -

ఏప్రిల్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. గోపీచంద్ కెరీర్‌లోభారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రం ఇదే కావ‌డం విశేషం. పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌, భూమిక‌, రెహ‌మాన్, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement