నల్లగొండ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లాలోని నిడమనూరు మండలం శాఖాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు చిన్నాల వెంకటయ్య ఆ పార్టీకి రాజీనామా చేసి మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరాడు. అదే విధంగా అనుముల మండలం ఉప ఎన్నికల ఇన్చార్జి, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సమక్షంలో రామడుగు గ్రామానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. గుర్రంపోడు మండలం వట్టికోడులో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే టీఆర్ఎస్లో చేరుతున్నామని వారు ఈ సందర్భంగా తెలిపారు.