హైదరాబాద్ : ఆన్లైన్లో హార్స్ రేస్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. మాదాపూర్‌లోని ఓయో రూమ్ కేంద్రంగా ఒంగోలుకు చెందిన సాయి గౌతమ్ రెడ్డి(27) ఆన్లైన్లో హార్స్ రేస్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు ఓయో రూమ్‌కు వెళ్లి సాయి గౌతమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద రూ. 6.20 లక్షల నగదు, 2 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.