న్యూఢిల్లీ : ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ వేరియంట్ ఓలా ఎస్1ను అధికారికంగా లాంఛ్ చేసింది. ఓలా ఎస్1 ప్రొతో పోలిస్తే చిన్న బ్యాటరీ ప్యాక్‌తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ 99,999కి అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 7 నుంచి డెలివరీలు ప్రారంభం కానుండగా ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు రూ 4999 చెల్లించి కంపెనీ వెబ్సైట్లో ఓలా ఎస్1ను బుక్ చేసుకోవచ్చు.
ఓలా ఎస్1 ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ అప్ ఫ్రంట్‌తో స్మూత్ ప్యానెల్ డిజైన్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఈ స్కూటర్ వైట్, జెట్ బ్లాక్, నియో మింట్, కోరల్ గ్లామ్, లిక్విడ్ సిల్వర్ కలర్స్‌లో లభిస్తుంది.ఎస్1 ప్రొ వాడిన మోటార్‌నే ఓలా ఎస్1లోనూ ఉపయోగించారు.
3కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో ఎకో మోడ్‌లో 128 కిలోమీటర్ల వరకూ ప్రయాణించే వెసులుబాటు ఉంది. పూర్తి చార్జింగ్‌తో నార్మల్, స్పోర్ట్స్ మోడ్‌లో వరుసగా 101 కిలోమీటర్లు, 90 కిమీల మైలేజ్ ఇస్తుంది. అయితే ఈ బైక్‌లో క్రూయిజ్ కంట్రోల్, హైపర్ మోడ్ వంటి ఫీచర్లను జోడించలేదని ఓలా తెలిపింది.