వివిధ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీసీఏ (సీబీసీఎస్) ఆరో సెమిస్టర్, బీసీఏ (నాన్ సీబీసీఎస్) మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ మేకప్ పరీక్షా ఫీజును ఈ నెల 9వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చని చెప్పారు.
ఆరేళ్ల పార్మ్ డీ మొదటి, రెండు, మూడు, నాలుగు, అయిదో సంవత్సరం పరీక్షలతో పాటు మూడేళ్ల పార్మ్ డీ మొదటి, రెండో సంవత్సరం మెయిన్, బ్యాక్లాగ్ పరీక్షా ఫీజును ఈ నెల 17వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలన్నారు. ఈ పరీక్షలను ఈ నెలాఖరులో నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.in చూసుకోవచ్చని సూచించారు.
వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఫార్మసీ (పీసీఐ), బీఫార్మసీ (సీబీసీఎస్), బీఫార్మసీ (నాన్ సీబీసీఎస్) మేకప్ పరీక్షలను ఈ నెల 14వ తేదీ నుంచినిర్వహించనున్నారు.
లా విభాగంలో వివిధ పీజీ డిప్లొమా కోర్సుల మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్, రెండో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 23వ తేదీ నుంచి, అన్ని డిగ్రీ కోర్సుల రెండు, నాలుగో సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎంసీఏ ప్రాక్టికల్ పరీక్షా తేదీలను మార్చినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలను ఈ నెల 13వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.in చూసుకోవచ్చన్నారు.