మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక తమిళ చిత్రం ‘ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్ ’. ఈ మూవీని ఏప్రిల్ 2న తెలుగులో విడుదల చేయబోతున్నారు. విజయ్ సేతుపతి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించగా , రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్‌పై డాక్టర్ రావూరి వెంకటస్వామి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ‘‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ చిత్రంలో నిహారిక ఇప్పటి వరకు చేయని పాత్ర పోషిస్తుందని అంటున్నారు.
2018లో తమిళ వర్షెన్ విడుదల చేయగా, ఇప్పుడు తెలుగు వర్షెన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో గౌతమ్ కార్తీక్, గాయత్రీ శంకర్, వీజీ చంద్రశేఖర్, రమేష్ తిలక్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ శరవణన్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులని తప్పక అలరిస్తుందని మేకర్స్ అంటున్నారు. తాజాగా ట్రైలర్ విడుదల చేయగా, ఇది సినీ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. మీరు ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి.