e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home News విన్నింగ్ రాకెట్‌ను చిన్నారికి గిఫ్ట్‌గా ఇచ్చిన జోక‌విచ్‌.. వీడియో వైర‌ల్‌

విన్నింగ్ రాకెట్‌ను చిన్నారికి గిఫ్ట్‌గా ఇచ్చిన జోక‌విచ్‌.. వీడియో వైర‌ల్‌

విన్నింగ్ రాకెట్‌ను చిన్నారికి గిఫ్ట్‌గా ఇచ్చిన జోక‌విచ్‌.. వీడియో వైర‌ల్‌

పారిస్‌: టెన్నిస్ వ‌ర‌ల్డ్ నంబ‌ర్ వ‌న్ నొవాక్ జోక‌విచ్‌.. ఆదివారం రాత్రి జ‌రిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైన‌ల్లో సంచ‌ల‌న విజయం సాధించిన విష‌యం తెలుసు క‌దా. తొలి రెండు సెట్లు ఓడిపోయినా.. త‌ర్వాత వ‌రుస‌గా మూడు సెట్ల‌లో గెలిచి కెరీర్‌లో 19వ గ్రాండ్‌స్లామ్ సాధించాడు ఈ సెర్బియ‌న్ సెన్సేష‌న్‌. అంతేకాదు ప్ర‌తి గ్రాండ్‌స్లామ్‌ను క‌నీసం రెండు సార్లు గెలిచిన తొలి ప్లేయ‌ర్‌గానూ అత‌డు నిలిచాడు. ఇంత‌టి సంతోష‌క‌ర‌మైన క్ష‌ణాల్లో అత‌డు త‌న విన్నింగ్ రాకెట్‌ను ఓ చిన్నారి అభిమానికి గిఫ్ట్‌గా ఇవ్వ‌డం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

త‌న అభిమాన ప్లేయ‌ర్ నుంచి ఊహించ‌ని రీతిలో రాకెట్ అందుకున్న ఆ చిన్నారి ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. ప‌ట్ట‌లేని సంతోషంతో అత‌డు గంతులేశాడు. మ్యాచ్ మొత్తం ఆ చిన్నారి జోక‌విచ్‌కు సపోర్ట్ చేస్తూ, అత‌న్ని ఉత్సాహ‌ప‌రిచాడు. తొలి రెండు సెట్లు ఓడినా అత‌డు త‌న వెంటే నిలిచాడ‌ని, త‌న రాకెట్ ఇవ్వ‌డానికి అత‌ని క‌న్నా బెస్ట్ ప‌ర్స‌న్ మ‌రొక‌రు క‌నిపించ‌లేద‌ని జోక‌విచ్ అన్నాడు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

ట్రెండింగ్‌

Advertisement