e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home News ఆ జిల్లాల పేర్ల మార్పునకు నోటిఫికేషన్‌ జారీ

ఆ జిల్లాల పేర్ల మార్పునకు నోటిఫికేషన్‌ జారీ

ఆ జిల్లాల పేర్ల మార్పునకు నోటిఫికేషన్‌ జారీ

హైదరాబాద్ : వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాలను హన్మకొండ, వరంగల్‌ జిల్లాలుగా పేర్లు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రాథమిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. మార్పుపై అభ్యంతరాలు, వినతులకు నెల గడువు విధించింది. హన్మకొండ, పరకాల రెవెన్యూ డివిజన్లతో కలిపి హన్మకొండ జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.

మొత్తం 12 మండలాలు ఈ జిల్లా పరిధిలోకి రానున్నాయి. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం కేంద్రం హన్మకొండ జిల్లా కేంద్రంగా కొనసాగనుంది. హన్మకొండ, కాజీపేట, ఐనవోలు, ధర్మసాగర్‌, వేలేరు, వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, హసన్‌పర్తి, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్‌, పరకాల, నడికుడ, దామెర మండలాలతో హన్మకొండ జిల్లాను ప్రతిపాదించింది.

- Advertisement -

వరంగల్‌, ఖిలావరంగల్‌, గీసుకొండ, ఆత్మకూరు, శాయంపేట, వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, సంగెం, నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపూర్‌, నెక్కొండ మండలాలు పునర్వ్యవస్థీకరణతో వరంగల్‌ జిల్లా పరిధిలోకి రానున్నాయి. జిల్లాల పేర్లు మార్చనున్నట్లు గత నెల 21న వరంగల్‌ పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆ జిల్లాల పేర్ల మార్పునకు నోటిఫికేషన్‌ జారీ
ఆ జిల్లాల పేర్ల మార్పునకు నోటిఫికేషన్‌ జారీ
ఆ జిల్లాల పేర్ల మార్పునకు నోటిఫికేషన్‌ జారీ

ట్రెండింగ్‌

Advertisement