పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి నోటా వాటా పెరిగింది. ఏ పార్టీకి ఓటు వేయడానికి ఇష్టపడని వారి కోసం ఈవీఎంలపై ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన నన్ అదర్ దేన్ అబౌ(పైన ఉన్న ఎవరూ కాదు-నోటా) గుర్తుపై గత అసెంబ్లీ ఎన్నికల కన్నా అధికంగా ఓటు వేశారు. అయితే ఇది 2015 ఎన్నికల్లో నమోదైన దాని కన్నా తక్కువే.
ఈసారి ఎన్నికల్లో నోటాకు మొత్తం 6,65,870 (1.81 శాతం) ఓట్లు పోలైనట్టు ఎన్నిక సంఘం తెలిపింది. అయితే గత ఎన్నికల్లో ఇది 1.68 శాతం కాగా, 2015 ఎన్నికల్లో అత్యధికంగా 2.48 శాతం నమోదయ్యిందని అధికారులు వివరించారు. కాగా, ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే తాజా ఎన్నికలు నిర్వహించనక్కర్లేదని గతంలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.