తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇష్క్’. ‘నాట్ ఏ లవ్‌స్టోరీ’ ఉపశీర్షిక. మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఆర్.బి.చౌదరి సమర్పకుడు. ఎస్.ఎస్.రాజు దర్శకుడు. శుక్రవారం చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదలచేసింది. ఇందులో హీరో తేజ కోపోద్రిక్తుడిగా కనిపిస్తుండగా ప్రియాప్రకాష్వారియర్ చిరునవ్వులు చిందిస్తోంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. భిన్న ధృవాల్లాంటి ఓ జంట కథతో ఆసక్తికరంగా సాగుతుంది. ఇటీవల విడుదలైన తొలి పాటకు చక్కటి స్పందన లభిస్తోంది. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు.