e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Home Entertainment కరోనా కల్లోలంలో బిడ్డను కనాలని లేదు..కమేడియన్ భారతిసింగ్ కంటతడి

కరోనా కల్లోలంలో బిడ్డను కనాలని లేదు..కమేడియన్ భారతిసింగ్ కంటతడి

కరోనా కల్లోలంలో బిడ్డను కనాలని లేదు..కమేడియన్ భారతిసింగ్ కంటతడి

ముంబై: టీవీ కమేడియన్, డ్యాన్స్ దీవానే హోస్ట్ భారతిసింగ్ తనకు ప్రస్తుత పరిస్థితుల్లో

పిల్లలను కనాలని లేదని లైవ్ షోలో చెప్పింది. 14 రోజుల బిడ్డను కరోనా వల్ల కోల్పోయిన

తల్లి విషాదం తెలిపేందుకు ఉద్దేశించిన ఓ డ్యాన్స్ ఐటం ముగిసిన తర్వాత భారతి భర్త హార్ష్

లింబాచియాతో కలిసి స్టేజి మీదకు వెళ్లి కన్నీళ్లు పెడుతూ మాట్లాడింది. కేవలం కరోనా

కారణంగానే ప్రస్తుతానికి తాను పిల్లలను కనాలని అనుకోవడం లేదని భారతి

చెప్పినప్పుడు ప్రేక్షకులు కదిలిపోయారు. “మేము ఓ బిడ్డను కనాలని అనుకున్నాం..

కానీ ఇలాంటి సంఘటనలు విన్నాక వద్దని తీర్మానించుకున్నాం.. ఇది మేము కావాలనే

తీసుకున్న నిర్ణయం.. ఇలాంటి విషాదాలు ఇంకా కొనసాగడానికి వీల్లేదు.. ఈ ఐటంలోని

తల్లి దుస్థితి నాకు రాకూడదని అనుకున్నాను” అని భారతి కన్నీళ్లు జలజలా రాలుతుంటే

చెప్పింది. డాన్స్ ప్రోగ్రాంకు జడ్జీలుగా వచ్చిన నోరా ఫతేహీ, తుషార్ కాలియా కూడా

కంటతడిపెట్టడం కనిపించింది.

Advertisement
కరోనా కల్లోలంలో బిడ్డను కనాలని లేదు..కమేడియన్ భారతిసింగ్ కంటతడి
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement