నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 28 : బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఆడపడుచులకు రాష్ట్రప్రభుత్వం సరఫరా చేసిన బతుకమ్మ చీరలను ప్రజాప్రతినిధులు, అధికారులు బుధవారం పలు గ్రామాల్లో పంపిణీ చేశారు.
మోస్రాలో జడ్పీటీసీ సభ్యుడు గుత్ప భాస్కర్‌రెడ్డి, ఎంపీపీ పిట్ల ఉమా శ్రీరాములు, చింతకుంటలో సర్పంచ్ విమలాలింగయ్య చీరల పంపిణీ చేశారు. తహసీల్దార్ సాయిలు, ఎంపీడీవో భారతి, ఎంపీటీసి సభ్యురాలు మమత, ఫెరోజ్, కార్యదర్శి ప్రేమ్ పాల్గొన్నారు. చందూర్ మండలంలోని లక్ష్మాపూర్, కారేగాం లో ఏఎంసీ చైర్పర్సన్ కవితాఅంబర్ సింగ్, సర్పంచ్ దేవీసింగ్, సత్యనారాయణ పంపిణీ చేశారు.
నిజామాబాద్ రూరద్ మండలంలోని మల్లారం, గాంధీనగర్ తండాల్లో ఎంపీపీ బానోత్ అనూషా ప్రేమ్‌దాస్, జడ్పీటీసీ సభ్యురాలు బొల్లెంక సుమలతా గోపాల్‌రెడ్డి చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో మల్లేశ్, వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మీసాల మధుకర్‌రావు, సర్పంచులు నగేశ్, అనూషా లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శులు ప్రశాంత్‌కుమార్, స్వప్న పాల్గొన్నారు.
ఇందల్వాయి మండలంలోని చంద్రాయన్పల్లి, నల్లవెల్లి, మల్లాపూర్, తిర్మన్‌పల్లి గ్రామాల్లో బతుకమ్మ చీరలను సర్పంచులు, ఎంపీటీసీలు పంపిణీ చేశారు. ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లిలో ఎంపీపీ రమేశ్‌నాయక్, నల్లవెల్లిలో ఐడీసీఎంసీఎస్ చైర్మన్ సాంబారి మోహన్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ భూసాని అంజయ్య, సర్పంచులు లోలం సత్యనారాయణ, నోముల విజయలక్ష్మారెడ్డి, లలితా గంగాదాస్, ఎంపీటీసీ చింతల దాసు, ఉపసర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రఘునందన్‌రావు, ఉపసర్పంచ్ ప్రకాశ్ పాల్గొన్నారు.
కోటగిరి మండలంం హంగర్గ ఫారంలో సర్పంచ్ ఎజాజ్‌ఖాన్ చీరలను పంపిణీ చేశారు. వర్ని మండలం శ్రీనగర్‌లో ఎంపీపీ మేక శ్రీలక్షీవీర్రాజు, సర్పంచ్ రాజు చీరలను పంపిణీ చేశారు.
బాల్కొండ మండలంలోని కిసాన్‌నగర్, బోదేపల్లి గ్రామాల్లో బతుకమ్మ చీరలను సర్పంచులు మానేటి తులసి నాగభూషణం, నోముల రవి అందజేశారు.
మెండోరా మండలంలోని పోచంపాడ్‌లో సర్పంచ్ మిస్బా పంపిణీ చేశారు. ఎంపీటీసీ జాన్‌బాబు, ఉపసర్పంచ్ సంపంగి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
భీమ్‌గల్ మండలంలోని బాచన్‌పల్లిలో మహిళలకు పార్టీ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, సర్పంచ్ ఆకుల కవిత గంగాధర్, ఉపసర్పంచ్ బాలయ్య, ఎంపీటీసీ సరిత స్వామి చీరలు పంపిణీ చేశారు.
మోర్తాడ్ మండలం గాండ్లపేట్, ధర్మోరా గ్రామాల్లో సర్పంచులు మామిడి సౌజన్య, మండల రాజేశ్వర్, ఎంపీటీసీలు అశోక్, లావణ్యసుధాకర్ పంపిణీ చేశారు.
వేల్పూర్ మండలంలోని పచ్చలనడ్కుడలో సర్పంచ్ ఏనుగు శ్వేత గంగారెడ్డి చీరలు పంపిణీ చేశారు. ఎంపీటీసీలు గుడాల గంగాధర్, నోముల గంగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ లింబారెడ్డి, వైస్‌చైర్మన్ రమేశ్ పాల్గొన్నారు.
ఎడపల్లి మండలంలోని అంబంలో ఎంపీపీ కె.శ్రీనివాస్, సర్పంచ్ పి.గంగాప్రసాద్ చీరెలను పంపిణీ చేశారు.
మాక్లూర్ మండలం కల్లెడిలో బతుకమ్మ చీరెలను వైస్ ఎంపీపీ సుక్కి సుజాత, పీఏసీఎస్ వైస్‌చైర్మన్ రమేశ్, ఎంపీవో శ్రీనివాస్ చీరెలను పంపిణీ చేశారు.
ఆర్మూర్ పట్టణంలోని పలు వార్డులు, మండలంలోని వివిధ గ్రామాల్లో బతుకమ్మ చీరెలను ప్రజాప్రతినిధులు, నాయకులు, టీఆర్ఎస్ నాయకులు అందజేశారు.