ఎల్లారెడ్డి, సెప్టంబర్ 22: ఎల్లారెడ్డిలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గంటపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా పట్టణంలోని ఎస్సీ, బీసీ కాలనీలతోపాటు, బస్టాండ్ సమీపంలోని కాలనీల్లో రోడ్లు జలమయమయ్యాయి. పలు చోట్ల వర్షం నీరు ఇండ్లలోకి వెళ్లింది.
వర్షానికి కూలిన ఇల్లు
ముప్కాల్, సెప్టెంబర్ 22: మండల కేంద్రంలోని సుభాష్‌కాలనీలో పన్నీర్ లక్ష్మికి చెందిన ఇల్లు బుధవారం కూలిపోయింది. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు గురువారం వెళ్లి కూలిన ఇంటిని పరిశీలించారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి ఇల్లు కూలిందని, ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. నష్టాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదికను పంపుతానని ఆర్ఐ గంగాధర్ తెలిపారు.
ముప్కాల్‌లో కూలిన ఇంటిని పరిశీలిస్తున్న ఆర్ఐ గంగారాం