2001లో వచ్చిన ఖుషీ తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినా కూడా పవన్ అభిమానుల ఆశలు మాత్రం తీర్చలేకపోయింది. మధ్యలో జల్సా సినిమా పర్లేదు అనిపించింది కానీ వాళ్లు కోరుకున్న బ్లాక్ బస్టర్ అయితే కాదు. అలాంటి సమయంలో వచ్చింది గబ్బర్ సింగ్. 2012, మే 11.. ఈ డేట్ ఎప్పటికీ పవన్ అభిమానులు మరిచిపోలేరు. ఎందుకంటే ఆ రోజే కదా 11 ఏళ్ల నిరీక్షణకు తెర దించేస్తూ గబ్బర్ సింగ్ రికార్డుల వేట మొదలు పెట్టాడు. ఇప్పటికీ గబ్బర్ సింగ్ అంటే ఏదో తెలియని మేనియా ఉంటుంది. ఈ సినిమా అప్పుడు ఎంత వసూలు చేసింది.. ఎన్ని రికార్డులు తిరగరాసిందో చూద్దాం..
నైజాం- 19.50 కోట్లు
సీడెడ్- 9.30 కోట్లు
ఉత్తరాంధ్ర- 5.50 కోట్లు
ఈస్ట్- 3.75 కోట్లు
వెస్ట్- 3.43 కోట్లు
గుంటూరు- 4.35 కోట్లు
కృష్ణా- 3.18 కోట్లు
నెల్లూరు- 2.05 కోట్లు
పవన్ కళ్యాణ్‌కు అప్పటికే వరస ఫ్లాపులు వస్తున్నా కూడా ఆయన మార్కెట్ మాత్రం ఇంతకూడా తగ్గలేదు. అందుకే గబ్బర్ సింగ్ సినిమాను అప్పట్లో రికార్డు రేట్లకు అమ్మారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 9 ఏళ్ల కిందే రూ.37 కోట్ల వరకు జరిగింది. 40 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన గబ్బర్ సింగ్ ఫుల్ రన్ లో 60 కోట్లకు పైగా వసూలు చేసింది. దాంతో బయ్యర్లకు లాభాల పంట పండింది. ఈ చిత్రంతోనే బండ్ల గణేష్ కూడా బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ అయిపోయాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పవన్ కళ్యాణ్‌తో మూవీ పక్కా అంటున్న బండ్ల గణేష్..!
అందరిలానే నాకు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయి: శృతి హాసన్
కరోనా బాధితుల కోసం ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న సోనూసూద్
ఇళయరాజా సోదరుడి సతీమణి కన్నుమూత
మంచు లక్ష్మీకి షాకిచ్చిన హ్యాకర్స్
అమ్మకు పాజిటివ్ అంటూ ఎమోషనల్ అయిన బిగ్ బాస్ విన్నర్
సోషల్ మీడియాలో రత్తాలు రచ్చ.. మండిపడుతున్న నెటిజన్స్