Karthikeya-2 Movie Collections | ప్రస్తుతం ఇండియాలో ‘కార్తికేయ-2’ హవా నడుస్తుంది. భారీ అంచనాల నడుమ ఆగస్టు 13న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తుంది. విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని కంటెంట్ పవర్ ఎంటో తెలియజేసింది. ప్రస్తుతం ఇండియాలో ఏ థియేటర్లో చూసిన ఈ సినిమా బొమ్మే. ముఖ్యంగా నార్త్‌లో ఈ సినిమాకు రోజు రోజుకు విపరీతమైన క్రేజ్ పెరుగుతుంది. హిందీ బెల్ట్‌లో మొదటి రోజు 50 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా 1000 స్క్రీన్లకు పైగా ప్రదర్శితమౌవుతుంది. ఇప్పటికే లాల్ సింగ్ ఛడ్డా, రక్షా బంధన్ థియేటర్లను కార్తికేయ-2 ఆక్యూపై చేసింది. విడుదలైన ప్రతి భాషలో కార్తికేయ-2 డబుల్ బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది.
తాజాగా ఈ చిత్రం 60కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఈ చిత్రంతో నిఖిల్ 60కోట్ల క్లబ్లో అడుగుపెట్టాడు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ చిత్రం రూ. 28.03 కోట్ల షేర్‌ను రాబట్టింది. నిఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా కార్తికేయ-2 నిలిచింది. బాలీవుడ్లో ఈ సినిమా కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. బాహుబలి, పుష్ప తర్వాత ఆ స్థాయిలో బాలీవుడ్లో కార్తికేయ-2 దూసుకుపోతుంది. ఈ చిత్రంతో హీరో నిఖిల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.అడ్వేంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. నిఖిల్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో నటించాడు.
🙏🏽🙏🏽🙏🏽#Karthikeya2 #Karthikeya2Hindi #KrishnaIsTruth pic.twitter.com/npHXzEG4ga
— Nikhil Siddhartha (@actor_Nikhil) August 20, 2022