Karthikeya-2 Movie Collections | యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘కార్తికేయ-2’. చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ గతవారం విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ చిత్ర కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మొదటి రోజుకు మించి మూడో రోజు కలెక్షన్లు అధికంగా వచ్చాయి. మూడురోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్‌గా నిలిచింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విడుదలైన ప్రతి భాషలో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుంది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో ఈ చిత్రానికి విశేష ఆధరణ వస్తుంది. మొదటి రోజు 50 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం మూడో రోజుకు 400కు పైగా స్క్రీన్లలో ప్రదర్శిస్తుంది. కాగా ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సరికి ఈ చిత్ర కలెక్షన్లను గమనిస్తే
నైజాం : 4.06 కోట్లు
సీడెడ్ : 1.83 కోట్లు
ఉత్తరాంధ్ర : 1.51 కోట్లు
ఈస్ట్ : 0.99 కోట్లు
వెస్ట్ : 0.73 కోట్లు
గుంటూరు : 1.14 కోట్లు
కృష్ణా : 0.87 కోట్లు
నెల్లూరు : 0.41 కోట్లు
ఏపి+తెలంగాణ : 11.54 కోట్లు (17.80 కోట్ల గ్రాస్)
కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా : 0.70 కోట్లు
ఓవర్సీస్ : 2.06 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ : 15.44 కోట్లు (26.60 కోట్ల గ్రాస్)
‘కార్తికేయ-2’ చిత్రానికి రూ.12.5 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సరికి రూ.15.44 కోట్ల కలెక్షన్లను సాధించి బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుంది. ఇప్పటికే నిర్మాతలకు రూ. 2.14 కోట్ల లాభాలు వచ్చాయి. కేవలం బాలీవుడ్లో ఈ చిత్రం 1.20 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది. ఎలాంటి ప్రమోషన్లు లేకుండా ఈ చిత్రం మూడు రోజుల్లో ఈ మేర కలెక్షన్లు సాధించిందంటే విశేషం అనే చెప్పాలి. ఇప్పటికే లాల్ సింగ్ చడ్డా, రక్షాబంధన్ వంటి సినిమా థియేటర్లను కార్తికేయ-2 ఆక్యూపై చేసింది.