సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ ): ప్రపంచ బాక్సింగ్ చాంపియన్, కామన్వెల్త్ గేమ్స్ పసిడి పతక విజేత నిఖత్ జరీన్..లైఫ్‌స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అంబాసిడర్గాఎంపికైంది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో లైఫ్‌స్పాన్ అధినేత నరేంద్రరామ్ నంబుల..నిఖత్‌కు ఒప్పంద పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా నరేంద్రరామ్ మాట్లాడుతూ ‘ప్రపంచం గర్వించదగ్గ ప్రముఖ భారత మహిళా బాక్సర్ నిఖత్. మా సంస్థకు ఆమెను బ్రాండ్ అంబాసడర్‌గా నియమించుకోవడం సంతోషంగా ఉంది’ అని అన్నారు. నిఖత్ స్పందిస్తూ పౌష్టికాహారం, ఆరోగ్య సంరక్షణ ప్రాముఖ్యతను ప్రపంచానికి పరిచయం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. భారత్‌ను ప్రపంచ ఆరోగ్య సంరక్షణ శక్తిగా మార్చడం మన కర్తవ్యం అని అన్నారు.