వైరల్ వీడియో: ఇంటర్నెట్లో చాలా డ్యాన్స్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. చాలామంది అద్భుతంగా డ్యాన్స్ చేసి ఆకట్టుకుంటారు. కొందరు స్టెప్పులేస్తుంటే కళ్లు తిప్పుకోలేం. అలాంటి ఒక వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతోంది. బాలీవుడ్ హిట్ సాంగ్ ‘ముజ్కో యాద్ సతాయే తేరీ’ పాటపై న్యూజిలాండ్ డ్యాన్సర్లు వేసిన స్టెప్పులు నెటిజన్ల మనసు దోచుకున్నాయి.
న్యూజిలాండ్‌లోని అక్లాండ్లో నివసిస్తున్న కొరియోగ్రాఫర్ రిచా చంద్ర ఈ వీడియోను షేర్ చేశారు. డ్యాన్స్ వర్కషాప్లో భాగంగా ఈ డ్యాన్స్ చేసినట్లు వెల్లడించారు. హిమేశ్ రేషమ్మియా సాంగ్‌పై రిచాతోపాటు డ్యాన్సర్లందరూ ఫర్ఫెక్ట్ స్టెప్పులేశారు. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నది. ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ వీడియోను 68వేల మంది లైక్ చేయడం విశేషం.