వెల్లింగ్టన్: తానుకూడా ఎన్నోసార్లు జాతి వివక్ష ఎదుర్కొన్నానని న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ పేర్కొన్నాడు. కొంతమంది సహచర ఆటగాళ్లనుంచి వివక్ష ఎదుర్కొన్నానని తన జీవితగాథ ‘బ్లాక్ అండ్ వైట్’ పుస్తకంలో పేర్కొన్నాడు.
న్యూజిలాండ్ క్రికెట్లో ఎక్కువగా తెల్లవాళ్ల ఆధిపత్యమే కొనసాగేదని, తోటి ఆటగాళ్లు పలుమార్లు వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసినా వాటిని పట్టించుకోలేదన్నాడు. తాను కొంత గోధుమవర్ణంలో ఉన్నందున వారు అలా ప్రవర్తించి ఉండవచ్చని టేలర్ పేర్కొన్నాడు. రాస్ టేలర్ 2006-22 మధ్యకాలంలో న్యూజిలాండ్ తరఫున 112 టెస్టులు, 236 వన్డేలు, 102 టి20లు ఆడాడు.