టాలీవుడ్లో వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఈ స్టార్ హీరో సినిమా వస్తుందంటే చాలు బాక్సాపీస్ వద్ద క్రేజ్ మామూలుగా ఉండదు. కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ స్టార్ హీరో సిటీకి సమీపంలో కొత్త ఫాంహౌస్ ఒకటి కొనుగోలు చేశాడన్న వార్త కొన్ని రోజులుగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అయితే దీనిపై ఓ అప్డేట్ ఇపుడు ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
పవన్ కల్యాణ్‌కు హైదరాబాద్‌లో ఇప్పటికే ఫాంహౌస్ (farmhouse ) ఉందని, ఎక్కువ సమయం అక్కడే గడుపుతాడని సన్నిహిత వర్గాలు వెల్లడించినట్టు ఓ టాక్ నడుస్తోంది. అయితే ప్రస్తుతం ఆ ఫాంహౌస్ పరిసరాల్లోనే చిన్న ఇంటిని నిర్మించుకుంటున్నారని, కొత్త ఫాంహౌస్ కొనుగోలు చేశాడన్న వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని చెప్పినట్టు ఇన్సైడ్ టాక్. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ ప్రస్తుతం హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu), వినోధయ సీతమ్ రీమేక్ చిత్రాల్లో నటిస్తున్నాడు.
పొలిటికల్ కమిట్మెంట్స్ దృష్ట్యా కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న పవన్..మళ్లీ ఎప్పుడు షూట్లో జాయిన్ అవుతున్నాడన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు పవన్ కల్యాణ్ అక్టోబర్ నుంచి దాదాపు 5 నెలల పాటు యాత్ర చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ లోపు రెండు సినిమాల షూటింగ్స్ పూర్తి చేయాల్సి ఉంది.