e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News చర్మ సంరక్షణలో ఆల్మండ్స్ భేష్ …నూతన అధ్యయనంలో వెల్లడి..

చర్మ సంరక్షణలో ఆల్మండ్స్ భేష్ …నూతన అధ్యయనంలో వెల్లడి..

చర్మ సంరక్షణలో ఆల్మండ్స్ భేష్ …నూతన అధ్యయనంలో వెల్లడి..

హైదరాబాద్ జూన్‌ 2: మనం నిత్యం పాటించే ఆహారపు అలవాట్లు చర్మ ఆరోగ్యానికి తోడ్పాటుఅందించడంలో అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తాయి. పరిశోధకులు ఫోటోడ్యామేజీగా పిలిచే సూర్య కిరణాల వల్ల కలిగే నష్టాలను ఎదుర్కోవడంలో ఆహార ప్రాధాన్యతలు చర్మం అంతర్గత రక్షణను ఏ విధంగా ప్రభావితం చేస్తాయనేదానిపై పరిశోధకులు అధ్యయనం చేశారు. సుదీర్ఘకాలం పాటు సూర్యకాంతి పడకుండా నిరోధించడం, రక్షణగా వస్త్రాలను ధరించడం, స్క్రీన్ లోషన్లను వినియోగించడం వంటివి ఫోటోడ్యామేజీ నుంచి రక్షించుకోవడానికి అత్యంత కీలకమైన వ్యూహాలుగా నిలుస్తుంటాయి. ఆహార అలవాట్లు కూడా చర్మ సంరక్షణలో తమ వంతు పాత్రను పోషిస్తుంటాయని నిరూపితమైంది. కాస్మెటిక్‌ డెర్మటాలజీలో ప్రచురితమై ఓ నూతన అధ్యయనం వెల్లడించిన దాని ప్రకారం యువీబీ రేస్ను తట్టుకునేలా చర్మాన్ని శక్తివంతం చేయడంలో బాదములు సహాయపడతాయని వెల్లడించింది.

లాస్‌ఏంజెల్స్‌లోని యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా (యుసీఎల్‌ఏ) పరిశోధకులు ప్రతి రోజూ బాదములు తినడం వల్ల యువీబీ కాంతి( సూర్య కిరణాల వల్ల చర్మం పాడవడానికి అతి ప్రధాన కారణం) వ్యాధినిరోధక శక్తి ఏమైనా పెరుగుతుందా…? చర్మపు కాంతిలో మార్పులేమైనా వస్తాయా…? అన్నదానిపై పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో 18–45 ఏండ్ల వయసు కలిగిన మహిళలు పాల్గొన్నారు. ఈ మహిళల్లో ‘చర్మం బర్న్‌ అయినప్పటికీ అతి సులభంగా మచ్చలు పడని’ మహిళల నుంచి కొద్దిగా బర్న్‌ కావడంతో పాటుగా అతి సులభంగా మచ్చలు పడే చర్మం కలిగిన మహిళలు ఉన్నారు. సాంకేతికంగా వీరిని ఫిట్జ్‌పాట్రిక్‌ స్కిన్‌ 2, 3,4గా విభజించారు. ఈ మహిళలను ర్యాండమ్‌గా 1.5 ఔన్సులు (42 గ్రాములు, 246 కేలరీల) బాదములు లేదంటే 1.8 ఔన్సులు (51 గ్రాములు, 200 కేలరీలు) ప్రీజెల్స్‌ను ప్రతి రోజూ 12 వారాల పాటు తీసుకోమన్నారు. ఈ అధ్యయనం పూర్తి చేయడానికి 29 మంది మహిళల సమాచారాన్ని విశ్లేషించారు.

చర్మ సంరక్షణలో ఆల్మండ్స్ భేష్ …నూతన అధ్యయనంలో వెల్లడి..

ఈ అధ్యయనంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అధ్యయన ప్రారంభం-ముగింపు సమయంలో మినిమల్‌ ఎరిథెమా డోస్‌ (ఎంఈడీ) పరిమాణం ఆధారంగా యువీబీ వ్యాధినిరోధకతను గుర్తించారు. చర్మం ఎర్రబారడానికి కారణమయ్యే అతి తక్కువ మోతాదు యువీబీ కాంతి ఎంఈడీ. (ఈ కేసులో, చేయి లోపలి చర్మం ఎంచుకున్నారు. ఎందుకంటే సూర్యకాంతికి అతి తక్కువ ప్రభావానికి ఇది గురవుతుంది). స్కిన్‌ ఫోటోడ్యామేజీకి మొదటి సూచిక ఎరిథెమా. ఎంఈడీ వృద్ధి చెందితే, యువీబీ ఫోటోడ్యామేజీకి వ్యతిరేకంగా రక్షణ కూడా వృద్ధి చెందుతుందని సూచించారు.ఈ అధ్యయన ఆరంభంలో విభిన్న గ్రూపుల నడుమ ఎంఈడీ పరంగా పెద్దగా తేడా లేదు. కానీ 12 వారాల తరువాత పరిశీలించినప్పుడు రెండు ఎంఈడీలలోనూ వృద్ధి చూశారు. బాదములు తీసుకున్న మహిళలతో పోలిస్తే ప్రిజెల్‌ గ్రూప్‌లో కనీస ఎరిథెమా ఉంది. గణాత్మకంగా గణనీయమైన మార్పులేవీ ఎంఈడీ లేదా ఎక్స్‌పోజర్‌ సమయం పరంగా ప్రిజెల్‌ గ్రూప్‌లో కనబడలేదు.

‘‘ చర్మం సహజసిద్ధమైన రక్షణను బలోపేతం చేయడంలో ఆరోగ్యవంతమైన చర్మం నిర్వహించడంలో కొన్ని రకాల ఆహార పదార్థాలేవైనా ప్రభావం చూపుతాయా అన్నది తెలుసుకోవడానికి మా బృందాలు ఆసక్తి చూపాయి. ఈ అధ్యయనం ద్వారా చర్మపు ఆరోగ్యంపై అర్థవంతమైన ప్రభావాన్ని ఆహార ప్రాధాన్యతలు చూపుతాయని వెల్లడి అయింది’’ అని యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, లాస్‌ ఏంజిల్స్‌ ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ డాక్టర్‌ ఝావోపింగ్‌ లీ’ అన్నారు. ‘‘ఈ అధ్యయనం ప్రకారం 12 వారాల పాటు ప్రతి రోజూ42 గ్రాముల బాదములు తీసుకుంటే ఎంఈడీ మెరుగుపడుతుంది. మరీ ముఖ్యంగా ఆసియా మహిళల్లో ఇది 20శాతం వరకూ వృద్ధి చెందింది. అంతేకాదు యువీబీ కాంతికి వ్యతిరేకంగా చర్మం అంతర్గత రక్షణకు మద్దతునందించడంలో బాదములు సహాయపడుతున్నాయని” పేర్కొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చర్మ సంరక్షణలో ఆల్మండ్స్ భేష్ …నూతన అధ్యయనంలో వెల్లడి..

ట్రెండింగ్‌

Advertisement