అంతరిక్షం అంటేనే ఓ అంతుచిక్కని రహస్యం. సుదూర విశ్వంలో ఎన్నో వింతలు, విశేషాలు. ఈ రహస్యాల గుట్టువిప్పేందుకు శాస్త్రవేత్తలు నిత్యం శ్రమిస్తూనే ఉంటారు. తాజాగా, అంతరిక్షంలో బృహస్పతి (జూపిటర్) కంటే అతిపెద్దదైన గ్రహాన్ని గుర్తించారు. ఈ భారీ గ్రహం జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌కు చిక్కింది.
ఈ భారీ గ్రహాన్ని హెచ్ఐపీ 65426 బీగా పిలుస్తున్నారు. ఈ గ్రహం నివాసగయోగ్యంకాదని పరిశోధకులు తేల్చారు. దీనిపై రాతి ఉపరితలాలు లేవని గుర్తించారు. ఇది ద్రవ్యరాశిపరంగా బృహస్పతి కంటే 12 రెట్లు పెద్దదని తేల్చారు. ఈ గ్రహం వయస్సు 15-20 మిలియ్ ఏండ్ల మధ్య ఉంటుందని తేల్చారు. దీనితో పోలిస్తే మన భూమి చాలా చిన్నది. మన గ్రహం వయస్సు 4.5 బిలియన్ సంవత్సరాలు మాత్రమే. కాగా, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన చిత్రంలో హెచ్ఐపీ 65426 బీ గ్రహం ఇన్ఫ్రారెడ్ లైట్ విభిన్న బ్యాండ్లలో మెరుస్తూ కనిపిస్తున్నది.