చెన్నై, సెప్టెంబర్ 8: అపాచీలో రెండు అప్‌గ్రేడ్ వెర్షన్స్‌ను గురువారం టీవీఎస్ ఆవిష్కరించింది. 160సీసీ, 180సీసీల్లో వచ్చిన ఈ బైక్‌ల ప్రారంభ ధర ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం రూ.1.17 లక్షలు, రూ.1.30 లక్షలుగా ఉన్నది.
మరింత శక్తి కోసం 160 సీసీ బైక్ బరువును 2 కిలోలు, 180 సీసీ బైక్ బరువును కిలో చొప్పున తగ్గించినట్టు టీవీఎస్ తెలియజేసింది.