మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కున్న చిత్రం లాల్‌సింగ్ చద్దా. ఇందులో నాగ చైతన్య కీలక పాత్ర పోషిస్తుండగా, ఇటీవలే టీంతో కలిసాడు. వాఖా గ్రామంలో చిత్రీకరణ జరిపినప్పుడు ఆ పరిసరాలలో చాలా చెత్త వదిలేశారని ఓ నెటిజన్ మండిపడ్డాడు. వాఖా గ్రామ ప్రజలకు చిత్ర యూనిట్ ఇచ్చిన బహుమతి ఇది. సత్యమేవ జయతేలో పర్యావరణం గురించి మాట్లాడిన అమీర్ వ్యక్తిగతంగా వచ్చే సరికి ఇలా ఉన్నారు అంటూ అక్కడి పరిస్థితులని వీడియోలో చిత్రీకరించి షేర్ చేశాడు.
నెటిజన్ వీడియో షేర్ చేసిన కొద్ది సేపటికి ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్ సంస్థ ‘ఏకేపీ’ స్పందిస్తూ.. ‘‘లొకేషన్ని శుభ్రంగా ఉంచలేదనే ఆరోపణను ఖండిస్తున్నాం. మేం లొకేషన్ని క్లీన్‌గా ఉంచేందుకు ఒక టీమ్‌ను పెట్టుకున్నాం. షూటింగ్ ప్యాకప్ కాగానే లొకేషన్ అంతా శుభంగా ఉందా, లేదా చెక్ చేస్తాం. స్థానిక అధికారులు ఎప్పుడైన మా లొకేషన్‌కి వచ్చి చెక్ చేసుకోవచ్చు అని పేర్కొంది. అయితే దీనిపై స్పందించిన సదరు నెటిజన్.. ఈ వీడియో చేసింది ఎవరిని కించపరచాలని కాదు, లడఖ్ పర్యావరణాన్ని కాపాడాలన్నదే మా ఉద్దేశం. లొకేషన్ చూడ్డానికి వెళ్లి వచ్చిన వారు ఆ ప్రాంతాన్ని చూసి విచారంగా వచ్చారు అంటూ తన ట్వీట్లో పేర్కొన్నాడు.