e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News ‘ఆస్ట్రాజెనెకా’ను నిషేధించిన మరో దేశం

‘ఆస్ట్రాజెనెకా’ను నిషేధించిన మరో దేశం

‘ఆస్ట్రాజెనెకా’ను నిషేధించిన మరో దేశం

ద హేగ్‌: ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ రూపొందించిన ఆస్ట్రాజెనెకా కరోనా టీకాను నిషేధించిన జాబితాలో మరో దేశం చేరింది. ఇప్పటికే ఆస్ట్రియా, డెన్మార్క్‌, నార్వే వంటి దేశాల ఆ టీకా వినియోగాన్ని నిలిపివేయగా, తాజాగా నెదర్లాండ్స్‌ కూడా ఆ వ్యాక్సిన్‌పై నిషేధం విధించింది. ఆస్ట్రాజెనెకా టీకా వేసుకున్న వారిలో తీవ్రమైన రక్తస్రావం, రక్తం గడ్డకట్టడం, బ్లడ్ ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోతుందని తేలడంతో దీన్ని నిషేధిస్తూ డచ్ మెడిసిన్స్ ఎవాల్యూషన్ బోర్డు నిర్ణయం తీసుకున్నది. దీంతో రెండువారాలపాటు టీకా వినియోగాన్ని నిలిపివేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. 

మార్చి 28వతేదీ వరకు రెండు వారాల పాటు అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ను వినియోగించవద్దంటూ ఆరోగ్యశాఖ మంత్రి హ్యూగో డి జోంగే తెలిపారు. వ్యాక్సిన్‌ వల్ల లేదా టీకా తీసుకున్న తర్వాత ఫిర్యాదులు వచ్చాయనేది ఇక్కడ అసలైన సమస్య అని, వ్యాక్సిన్‌పై ప్రజల్లో ఎలాంటి సందేహాలు ఉండకూడదని చెప్పారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తాము వ్యాక్సిన్‌ను నిలిపివేస్తున్నామని వెల్లడించారు. 

ఇదేరకమైన కారణాలతో ఆస్ట్రాజెనెకా టీకాపై డెన్మార్క్, ఆస్ట్రియా, ఎస్టోనియా, లిథువేనియా, నార్వే, థాయిలాండ్, ఐస్‌లాండ్ దేశాలు ఆదివారం నిషేధించాయి. కాగా, ఇప్పటికే 50 లక్షల మంది యూరోపియన్లు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ తీసుకున్నారు.  

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘ఆస్ట్రాజెనెకా’ను నిషేధించిన మరో దేశం

ట్రెండింగ్‌

Advertisement