Bigg boss | బిగ్ బాస్ రియాలిటీ షో నిజానికి మన కాన్సెప్ట్ కాదు. మన దగ్గర ఇలాంటి షోలు వర్కవుట్ అవ్వవని చాలా రోజుల నుంచి ఎంతో మంది విశ్లేషకులు చెబుతూనే ఉన్నారు. అయినా కూడా అన్నీ బేఖాతరు చేసి షో మొదలు పెట్టారు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ 2017లో మొదలైన బిగ్‌బాస్ తెలుగు మొదటి సీజన్ సూపర్ డూపర్ హిట్ అయింది. దానికి జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ బలంగా మారింది. ఆ తర్వాత నాని హోస్ట్ చేసిన రెండో సీజన్ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక మూడో సినిమా నుంచి నాగార్జున బిగ్‌బాస్ హోస్ట్ అయిపోయాడు. ఇప్పుడు కూడా ఈ షోకు బాగానే రేటింగ్ వస్తుంది. అయితే ఇక్కడ అసలు విషయమేంటంటే.. బిగ్‌బాస్ రియాలిటీ షోను ఎవరు ఇష్టపడతారో.. అంతకంటే ఎక్కువమంది దీన్ని విమర్శిస్తుంటారు.
బిగ్‌బాస్ షో వల్ల ఉపయోగమేంటి? ఇంట్లో ఆడ, మగ చేసుకునే రొమాన్స్.. వాళ్లు వేసే జోక్స్.. సిగ్గులేకుండా వాళ్లు చేసే వెకిలి చేష్టలు కెమెరాల్లో బంధించి ప్రేక్షకులకు చూపించడం వల్ల ఉపయోగం ఏంటి అని చాలామంది ఈ షోపై విరుచుకు పడుతూనే ఉన్నారు. అయితే మిగిలిన భాషలతో పోలిస్తే మన బిగ్‌బాస్ ఇంకా కాస్త పద్ధతిగా సాగుతుందనే వారు లేకపోలేదు. హిందీలో అయితే మరీ విచ్చలవిడితనం పెరిగిపోయింది.. తెలుగులో మాత్రం చాలా పద్ధతిగా సెన్సార్‌తో ఈ షో నడిపిస్తున్నారని అంటున్నారు అభిమానులు. అయితే సీజన్ 5 మొదలైన తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజంగా సెన్సార్ చేస్తున్నారా లేదా అనిపిస్తుంది.
ఎందుకంటే నామినేషన్ సమయంలో ఉమాదేవి మాట్లాడిన బూతు మాటలు రెండు తెలుగు రాష్ట్రాలు విన్నాయి. ఆ మాటలు వినలేక షణ్ముఖ్ జస్వంత్ ఏకంగా చెవులు మూసుకున్నాడు. దాంతో పాటు మరికొందరు కూడా ఇష్టం వచ్చినట్లు నోరుజారి మాటలు తూలుతున్నారు. ఇక రొమాన్స్‌కు అయితే హద్దూ పద్దూ లేకుండా పోతుంది. ఇంట్లో అమ్మాయిల గ్లామర్ షో కూడా అలాగే ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత పలువురు రాజకీయ నాయకులు కూడా వెంటనే బిగ్‌బాస్ షో బ్యాన్ చేయాలంటూ రోడ్డెక్కుతున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే ఆ షోలో పాల్గొని బయటికి వచ్చిన తర్వాత ఆ కంటెస్టెంట్స్ కూడా బిగ్‌బాస్‌పై విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా ఇన్ని విమర్శల మధ్య బిగ్ బాస్ ఇంకా ఎన్ని సీజన్స్ ఇలాగే సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్తుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Rashmika Mandanna : రహస్యాల్ని బయటపెట్టను!
Bigg Boss: కాజల్‌కి ఫుల్ క్లాస్ పీకిన ప్రియ..ఎందుకో తెలుసా?
Bigg Boss: ఈ వారం బెస్ట్, వరస్ట్ పర్ఫార్మర్స్ ఎవరో తెలుసా?
Idol Winner: ఇద్దరు భార్యలు,ఇద్దరు గార్ల్ ఫ్రెండ్స్‌ని సెట్ చేసుకున్న ఐడల్ విన్నర్
తమన్నాని అలా చూసి ఏడ్చేసిన దర్శకుడి కూతురు..!