స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi), నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కాంబోలో వస్తున్న ప్రాజెక్టు ఎన్బీకే 108 (NBK 108). ఈ సినిమాపై తాజా అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. స్క్రిప్ట్ బేసిక్ డ్రాఫ్ట్ సిద్దమైందట. అనిల్ రావిపూడి అండ్ టీం ప్రస్తుతం స్క్రీన్ ప్లే పనులపై ఫోకస్ పెట్టిందని టాక్. వారం రోజుల్లో స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నారట అనిల్ రావిపూడి టీం. ఆగస్టులో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ చిత్రంలో బాలకృష్ణ కూతురిగా పెళ్లి సందD ఫేం శ్రీలీల నటిస్తున్నట్టు అనిల్ రావిపూడి ఇప్పటికే ప్రకటించాడు. ఇక సీనియర్ హీరోయిన్ ఒకరు బాలకృష్ణకు జోడీగా మెరువనున్నారని తెలుస్తోండగా..ఆ బ్యూటీ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉంది. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో చేస్తున్న సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు బాలయ్య. ఈ ప్రాజెక్టు పూర్తవగానే అనిల్ రావిపూడి ప్రాజెక్టుతో బిజీ కానున్నాడని ఫిలింనగర్ సర్కిల్ టాక్.