న్యూఢిల్లీ: సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ నటాషా పూనావాలా ఇవాళ కోవిడ్ టీకా తీసుకున్నారు. ఆమె వయసు 39 ఏళ్లు. తమ కంపెనీయే ఉత్పత్తి చేస్తున్న కోవీషీల్డ్ టీకానే వేసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఆస్ట్రాజెన్కా-ఆక్స్ఫర్డ్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ను సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్నది. టీకా తీసుకోవడం గర్వంగా ఉందని, జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని, కోవీషీల్డ్ టీకాలు సురక్షితమైనవి, ప్రభావంతమైనవని నటాషా పూనావాలా తెలిపారు. సీరం సంస్థ సీఈవో ఆధార్ పూనావాలా భార్యే నటాషా. గవీ వ్యాక్సిన్ కూటమికి చెందిన సీత్ బెర్క్లే, యునిసెఫ్, డబ్ల్యూహెచ్వో, గేట్స్ ఫౌండేషన్ సహకారంతోనే కోవాక్స్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం ప్రపంచ దేశాలకు కోవీషీల్డ్ సరఫరా చేసినట్లు నటాషా తెలిపారు.