న్యూఢిల్లీ, మే 4: గ్రహాంతర వాసులను ఆకర్షించడానికి మనుషుల నగ్న చిత్రాలను అంతరిక్షంలోకి పంపించాలని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఏలియన్స్ ఒకవేళ ఉండి ఉంటే ఈ చిత్రాలను చూసి బొమ్మల దగ్గరకు వస్తాయని, తద్వారా వాటి ఉనికిని తెలుసుకోవచ్చని ఆలోచిస్తున్నారు.
ఇందుకోసం ‘గేలక్సీలో దారిదీపం’ అనే ప్రాజెక్టులో భాగంగా స్త్రీలు, పురుషుల నగ్న చిత్రాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. గ్రహాంతర వాసుల ఉనికి కోసం ఎన్నో ఏండ్లుగా ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.