e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News అమానుషం

అమానుషం

అమానుషం

ఇప్పపువ్వు సేకరణకు వెళ్లిన గిరిజనులపై అధికారుల దాడి
అచ్చంపేట దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులు
అచ్చంపేట, మార్చి 27 : నిరుపేదలైన గిరిజనులు అటవీ ఉత్పత్తుల సేకరణకు అడవిలోకి వెళ్లగా వారిపై ఫారెస్ట్‌ అధికారులు దాడి చేసిన సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలంలోని నల్లమల అ డవిలో చోటు చేసుకున్నది. బాధితులు, పోలీసుల క థనం మేరకు.. అచ్చంపేట మండలం చెంచుపలుగుతండా, గుంపన్‌పల్లికి చెందిన 24 మంది గిరిజనులు (16 మంది మహిళలు, 8 మంది పురుషులు) నల్లమలలోకి ఇప్పపువ్వు సేకరణకు మూడ్రోజుల కిందట వెళ్లారు. హోలీ, ఉగాది పండుగకు దేవుడికి నైవేద్యం పెట్టేందుకు, ఇంటి అవసరాలకు వాడుకునేందుకు ఇ ప్పపువ్వు సేకరించారు. తిరిగి ఇండ్లకు వస్తుండగా.. శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఎఫ్‌బీవో రామాంజనేయులు ఆధ్వర్యంలో దుర్వాసుల చెరువు బేస్‌ క్యాంపు వాచర్లు, ఫైర్‌ వాచర్లు యాదయ్య, శ్రీ ను, సురేశ్‌, నిరంజన్‌, రాకేశ్‌తోపాటు పది మందికిపై గా అటవీ శాఖాధికారులు, ఉద్యోగులు గిరిజనులు ని ద్రిస్తున్న ప్రాంతానికి వెళ్లి దాడి చేశారు. ఎవరు, ఎం దుకు కొడుతున్నారో తెలియని అయోమయ పరిస్థితి. కాళ్లు మొక్కినా.. వద్దని వారించినా.. భయంతో వణికిపోతున్నా వదలకుండా ఇష్టానుసారంగా దూషిస్తూ కాళ్లతో తొక్కడంతోపాటు కర్రలతో చితకబాదారు. మ హిళలు అని కూడా కరుణించలేదు.

జీపులో ఎక్కించి తీసుకెళ్లి దుర్వాసుల చెరువు బేస్‌ క్యాంపులో బంధించారు. దాడిలో మత్రు, పత్య, దేవ్లి, పింకిలి, జయ, శాంతి, తారాసింగ్‌, అచ్చాలి, జమిని, హతియ, అం తాలి, తిరుపతి, జాంకి, లక్ష్మణ్‌, తావుర్యా, సేవ్యా, ల చ్చు, రాములు, సేవ్యా, మత్రి, సిత్య తదితరులకు గా యాలయ్యాయి. ఇందులో తారాసింగ్‌, మత్రులకు తీ వ్రగాయాలయ్యాయి. వీరిని హైదరాబాద్‌ దవాఖాన కు తరలించనున్నట్లు డాక్టర్‌ కృష్ణ, శంకర్‌ తెలిపారు. ఈ దాడి నుంచి ఇద్దరు గిరిజనులు తప్పించుకొని తం డావాసులకు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. తండాల నుంచి ఎడ్లబండ్లు కట్టుకొని వచ్చి వారిని తీ సుకెళ్లారు. శనివారం ఉదయం వారి బంధువులు బేస్‌ క్యాంప్‌ వద్దకు వెళ్లి నడవడానికి చేతగాక పడి ఉన్న వారిని అచ్చంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతున్నారు. సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావడంతో సీఎం కేసీఆర్‌ ఉదయం జిల్లా కలెక్టర్‌ శర్మన్‌ ద్వారా ఆరా తీసినట్లు తెలిసింది.


శ్రీశైలం రహదారిపై రాస్తారోకో ..
శ్రీశైలం-హైదరాబాద్‌ రహదారిపై బేస్‌ క్యాంపు వ ద్ద బాధిత కుటుంబాలు, గిరిజన సంఘాల ఆధ్వర్యం లో శనివారం పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. భారీ గా వాహనాలు నిలిచిపోయాయి. అచ్చంపేట డీఎస్పీ నర్సింహులు, ఆర్డీవో పాండునాయక్‌, సీఐ బీసన్న, ఎస్సైలు పోచయ్య, వెంకటయ్య, ప్రదీప్‌, వీరబాబు అక్కడికి చేరుకొని ఆందోళన కారులతో మాట్లాడారు. దాడిచేసిన అటవీ ఉద్యోగులను సస్పెండ్‌ చేసి, వాచ ర్లు, ఫైర్‌ వాచర్లను విధుల నుంచి తొలగించాలని డి మాండ్‌ చేశారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన అటవీ ఉద్యోగులపై ఆందోళనకారులు దాడికి యత్నించారు. దీంతో వారు పరుగులు తీశారు. దాడికి పాల్పడిన వారిని సస్పెండ్‌ చేస్తానని రేంజర్‌ రవిమోహన్‌ భట్‌ పేపర్‌పై రాసి ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం అచ్చంపేట డీఎఫ్‌వో కార్యాలయం వద్ద బాధితులతో కలిసి బైఠాయించి గంటసేపు ఆందోళన చేపట్టారు. అయినా డీఎఫ్‌వో రాకపోవడంతో ఆగ్ర హం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఆ యా పార్టీలు, సంఘాల నాయకులు ఎఫ్‌డీవో శ్రీనివాసులును కలిసి వివరించారు. రేంజర్‌ మనోహర్‌ను పిలిపించి దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితుల వివరాలు సేకరించాలని పంపించారు. మన్ననూర్‌, చెంచుపలుగుతండా నుం చి గిరిజనులు నాయకులు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ తులసీరాం, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గోపాల్‌నాయక్‌, సర్పంచులు, నాయకు లు ఆందోళనలో పాల్గొన్నారు. దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి అమ్రాబాద్‌ సీఐ బీసన్న, ఎస్సైలు పో చయ్య, వీరబాబులు వివరాలు సేకరించి అడవిలో సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు.
సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తా : విప్‌ గువ్వల
గిరిజనులపై దాడి చేయడం అమానుషమని, ఈ సంఘటనను జీర్ణించుకోలేకపోతున్నానని ప్రభుత్వ వి ప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. దవాఖాన కు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అ నంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కుటుంబాలకు అండగా ఉంటానని, భయందోళన చెందాల్సి న అవసరం లేదన్నారు. దాడి చేసింది ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. మహిళలను కూడా కొట్టడం బాధాకరమన్నారు. ఈ ప్రాంతంలో జీవించే హక్కును అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్‌, డీజీపీ, పీసీసీఎఫ్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించి కాపాడుకుంటానన్నారు. అలాగే దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను నాగర్‌కర్నూల్‌ క లెక్టర్‌ శర్మన్‌ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దాడికి పాల్పడిన వా రిపై చట్టపరంగా చర్యలు తీ సుకుంటామన్నారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్‌, గిరిజన శాఖ మంత్రి సత్యవతిరాథో డ్‌, కమిషనర్‌ ద్వారా వివరాలు ఆరా తీశారన్నారు. అటవీశాఖ ఉద్యోగులపై బాధితులు, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని బల్మూర్‌ ఎస్సై వీరబాబు తెలిపారు. ప్రస్తుతం ఆరుగురిపై కేసు నమోదు చేశామని, మిలిగిన వారిపై విచారణ జరుపుతున్నామన్నారు.
చర్యలు తీసుకుంటాం : ఎఫ్‌డీవో రాజశేఖర్‌


అటవీ శాఖ సిబ్బంది తప్పుంటే కచ్చితంగా చ ర్యలు తీసుకుంటామని అచ్చంపేట ఎఫ్‌డీవో రాజశేఖర్‌ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ మా సిబ్బంది ఎవరినీ కొట్టలేదని, విధుల్లో భాగంగా అడవిలో తిరుగుతారన్నారు. ఉదయం 7 గం టలకు ఉ ద్యోగులను కొ ట్టారని, దాడికి పాల్పడి న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అడవి నుంచి బయట కు వెళ్లిపోండని సిబ్బంది చెప్పారని, వారి సురక్షితం కోసం బయటకు తీసుకొచ్చారన్నారు. 17 మందిని బంధించారనడం కరెక్టు కాదన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అమానుషం

ట్రెండింగ్‌

Advertisement