e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home News అట్టహాసంగా

అట్టహాసంగా

అట్టహాసంగా

ప్రారంభించిన జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణసుధాకర్‌రెడ్డి
పది జిల్లాల నుంచి పాల్గొన్న 160 మంది క్రీడాకారులు

మహబూబ్‌నగర్‌ టౌన్‌, మార్చి 25 : మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో 43వ జూనియర్‌ రాష్ట్ర స్థాయి బాలికల హ్యాండ్‌బాల్‌ టోర్నీ అట్టహాసంగా ప్రారంభమైం ది. మహబూబ్‌నగర్‌ హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం శ్రీరా మ ల్యాండ్‌మార్క్‌లోని పాలమూరు స్పో ర్ట్స్‌ అకాడమీలో హ్యాండ్‌బాల్‌ టోర్నీని జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణసుధాకర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభు త్వం అన్ని విధాలా కృషి చేస్తుందని తెలిపారు. క్రీడల్లో గెలుపోటములు సహజమ ని, క్రీడాస్ఫూర్తిని చాటాలన్నారు. కరోనా సమయంలో ధైర్యంగా క్రీడల్లో పాల్గొన డం అభినందనీయమని, జాగ్రత్తలు పా టించాలన్నారు.

క్రీడలతో మానసికోల్లాసంతోపాటు శారీరక దారుఢ్యం పెంపొందుతుందన్నారు. జిల్లాలో ప్రతిభ గల క్రీ డాకారులకు కొదవలేదని, ఎంతో మంది రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నార ని, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆ కాక్షించారు. జిల్లాలో మైదానాల అభివృద్ధిపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ దృష్టి సారించారన్నారు. అనంతరం ఆయా జిల్లాల క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. టోర్నీలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌ జిల్లాల నుంచి 160 మంది క్రీడాకారులు, 40 మంది అఫీషియల్స్‌ పాల్గొన్నారు. కార్యక్రమంలో డీవైఎస్‌వో శ్రీనివాస్‌, శ్రీరామ, జయరామ ఎండీ బి.రామిరెడ్డి, హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి పవన్‌కుమార్‌, ఇండియన్‌ హ్యాండ్‌బాల్‌ కోచ్‌ రవికుమార్‌, హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు శాంత, పేట అధ్యక్షుడు జగన్‌మోహన్‌గౌడ్‌, జిల్లా హ్యాండ్‌బాల్‌ సెక్రటరీ జియాఉద్దీన్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ మహ్మద్‌ఆసీఫ్‌, పీడీ వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్‌ జట్టు శుభారంభం
హ్యాండ్‌బాల్‌ టోర్నీలో మహబూబ్‌నగర్‌ బాలికల జట్టుకు శుభారంభం లభించింది. టోర్నీలో ఆయా జిల్లాల జట్లు రసవత్తరంగా తలబడ్డాయి. మహబూబ్‌నగర్‌ బాలికల జట్టు మెదక్‌పై 14-1, నిజామాబాద్‌పై 7-5 తేడాతో విజయం సా ధించగా, నల్లగొండతో జరగనున్న మ్యాచ్‌ గెలిస్తే సెమీస్‌కు చేరనున్నది. అలాగే ఆదిలాబాద్‌ జట్టు ఖమ్మంపై 9-2, రంగారెడ్డి జట్టు కరీంనగర్‌పై 8-3, ఖమ్మం జట్టు వరంగల్‌పై 6-4, నల్లగొండ జట్టు మెదక్‌పై 8-4, హైదరాబాద్‌ జట్టు నిజామాబాద్‌పై 11-2, రంగారెడ్డి జట్టు ఆదిలాబాద్‌పై 7-1, హైదరాబాద్‌ జట్టు మెదక్‌పై 15-0, వరంగల్‌ జట్టు కరీంనగర్‌పై 7-3 స్కోర్‌ తేడాతో గెలుపొందాయి.

Advertisement
అట్టహాసంగా
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement